కామారెడ్డి, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు ఉదృతంగా వస్తుందని చెప్పారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, విద్యుత్తు, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలోని నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డివిజనల్ పంచాయతీ అధికారి సాయిబాబా, విద్యుత్తు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.