కామారెడ్డిలో విషాదం, విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి

కామారెడ్డి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు.

మృతుల వివరాలు
హైమద్‌ (35), పర్వీన్‌ (30), అద్నాన్‌ (4), మాహిమ్‌ (6) మృతి

ఇంట్లో మొదట పిల్లలకు విద్యుత్‌ వైర్‌ తగిలి వారిని పట్టుకున్న తల్లిదండ్రులకు విద్యుత్‌ ప్రవాహం కావడంతో మృతి చెందినట్టు సమాచారం. స్థానికులు మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తలించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్‌ కాలనీలో విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్‌, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న హైమద్‌ (35), అతని భార్య పర్వీన్‌ (30),కుమారుడు అద్నాన్‌ (4), కూతురు మాహిమ్‌ (6) ల మృతి చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆర్ధిక సహాయం ప్రకటించారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడిరచారు.

హృదయవిదారక సంఘటన తెలిసి ముఖ్యమంత్రి చెలించి పోయారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే మానవతా దృక్పథంలో మృతులకు 3లక్షల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రికి మంత్రి వేముల దన్యవాదాలు తెలిపారు.

Check Also

నిజామాబాద్‌కు రూ. 30 లక్షల విలువచేసే అంబులెన్సు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథాంగ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »