నిజామాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సారస్వత పరిషత్ వారిచే వెలువడనున్న నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం ఈ నెల 17న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి శ్రీ అపురూప కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు పుస్తక కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు.
ఏడు గురు కొర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 44 మంది వ్యాసకర్తలు రాసిన పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, విశిష్ట అతిధిగా సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జై చెన్నయ్య, గౌరవ అతిధిగా సారస్వత పరిషత్ కోశాధికారి మంత్రి రామారావు విచ్చేయనున్నారని, నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చేతుల మిదుగా పుస్తక ఆవిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కొర్ కమిటి సభ్యులకు, వ్యాస కర్తలకు, కవులకు అతిధులచే సన్మాన కార్యక్రమం ఉంటుందని, జిల్లా కవులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.