కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును బుధవారం పరిశీలించారు. తూము వద్ద ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదల అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అలుగు పైనుంచి వస్తున్న వరద నీరును పరిశీలించారు. అలుగు వద్దకు ప్రజలు ఎవరూ రావద్దని పేర్కొన్నారు. వర్షాలకు చెరువులు పూర్తిస్థాయిలో నిండినందున ప్రతిరోజు గంట గంటకు నీటిమట్టాలను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించాలని పేర్కొన్నారు.