నిజామాబాద్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రిపుల్ ఐటి బాసర విద్యార్థులకు రాష్ట్ర అఖిల పక్షం నేతలు సంఫీుభావం తెలిపారు. బాసర విద్యార్థులు విష ఆహారానికి గురైన దరిమిలా నిజామాబాద్ హోప్ ఆసుపత్రికి పలువురు నేతలు వచ్చి పరామర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హోప్ ఆసుపత్రిని సందర్శించి ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా త్రిపుల్ ఐటి బాసరకు పూర్తిస్థాయి వైస్‌ఛాన్స్‌లర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. మెస్ టెండరును రద్దుచేసి ప్రభుత్వమె నిర్వహించాలని, మౌలిక వసతుల కల్పనతో పాటు టీచింగ్ స్టాఫ్‌ను పూర్తిస్థాయిలో నియమించాలని డిమాండ్ చేశారు. బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విద్యార్థులను పరామర్శించారు. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్లిబొల్లి మాటలు ఆపి ఒకరోజు త్రిపుల్ ఐటి బాసర విద్యార్థులతో క్యాంపస్‌లో బస చేయాలని, అప్పుడే విద్యార్థుల పరిస్థితులు సిఎంకు అర్ధమవుతాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజంలోని బలహీన వర్గాల ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. కనీసం నిమ్నజాతులు, వెనకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజలను ఓట్లకు మాత్రమే పనికివస్తారనే భావనతో ముఖ్యమంత్రి ఉన్నారని, తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నది కెసిఆర్ అని దుయ్యబట్టారు. సిపిఎం, బిజెపి, కాంగ్రెస్ నాయకులు సైతం విద్యార్ధులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ వైస్‌ఛైర్మన్ వెంకట్ రమణ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమీషనర్ ఆదేశం మేరకు త్రిపుల్ ఐటి బాసరను అన్ని విధాలుగా పరీక్షించి తగు విధమైన చర్యలతో పాటు ప్రభుత్వానికి నివేదిస్తామని, అంతేకాకుండా పూర్తిగా ప్రభుత్వ పరంగా మెస్ నిర్వహించేలా చూస్తామని అన్నారు.
సిపిఎం ప్రజాపంథ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధులను అధ పాతాళానికి తొక్కుతుందని, వారి యోగక్షేమాలు అవసరం లేనట్టు ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. పంజాబ్ రైతులకు సంఫీుభావం తెలిపిన ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యార్థులను పరామర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.