కామారెడ్డి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో బాధ్యతారాహిత్యం పాటిస్తే ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుంది, కాబట్టి కచ్చితంగా విద్యార్థులను సురక్షితమైన స్థలాలలో కూర్చోబెట్టాలన్నారు. మండల విద్యాధికారులు తమ తమ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలను అందించాలన్నారు.