భారత సేవాశ్రమ సంఘం ఆద్వర్యంలో ఉచిత నోటుపుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత సేవాశ్రమ సంఘం, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు 11 వేల 500 నోటుబుక్కులు 2 వేల 300 మంది ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయడానికి స్వామి వెంకటేశ్వర నందజి ఉచితంగా అందజేశారు.

కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, డీఈఓ రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు సిహెచ్‌. సాయిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

24 మందికి గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా

Print 🖨 PDF 📄 eBook 📱 జగిత్యాల, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »