నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెల్లవారుజామున రుక్మిణి చాంబర్స్ హైదరాబాదు రోడ్డు దగ్గర టిఎస్ 12 ల 9792 వ్యాన్ ద్వారా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యంను పోలీస్ పెట్రోలింగ్ టీం పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు. తదుపరి కేసు విచారణ నిమిత్తం పౌరసరఫరాల శాఖకు ఇవ్వడం జరిగిందన్నారు.
విచారణ జరిపి 140 క్వింటాళ్ళ బియ్యం స్వాధీనపరచుకొని అట్టి వ్యక్తులపై నిత్యవసర వస్తువుల చట్టం 1955 కింద కేసులు నమోదు చేయడం జరిగిందని, అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు కూడా వేయడం జరిగిందన్నారు. విచారణలో అట్టి లారీ బియ్యం కరీంనగర్ నుండి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు వెళ్ళుచున్నదని డ్రైవర్ విచారణలో వెల్లడిరచాడని డీఎస్‌ఓ తెలిపారు. వ్యాను స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్ టౌన్ నంబర్ 4 నందు ఉంచినట్టు పేర్కొన్నారు.