కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని పేర్కొన్నారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేయాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా విద్యాధికారి రాజు, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, వైద్య, విద్యుత్తు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.