డిచ్‌పల్లి, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం మరియు ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సిపిఆర్ (కార్డియో పల్ననరీ రీ సస్టేషన్) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ అన్నింటిల్లో కెల్లా ప్రాణాలను కాపాడడమే ఉత్తమమని అన్నారు.
ఆపద సమయంలో తోటివారిని ఎలా కాపాడవచ్చో విద్యార్థులకు అవగాహన కల్పించారు. భయానక సన్నివేశాలను తిలకించినప్పుడో, అగ్ని గాని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడో, విద్యుత్ షాక్ కొట్టినప్పుడో, గొంతులో నాణెం దిగినప్పుడో, ఫిట్స్ వచ్చినప్పుడో, గురక పెడుతూ ఆగిపోయినప్పుడో, అన్నం తినేప్పుడు గొంతు దిగనప్పుడో, హార్ట్ ఎ టాక్ వచ్చినప్పుడో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు సిపిఆర్ విధానాన్ని అనుసరించాలన్నారు. ఈ విధానాన్ని నాలుగు రకాలుగా నిర్వర్తించాలన్నారు.
మొదట ప్రమాద జరిగిన పరిసర ప్రదేశం సంరక్షణమైందా? కాదా?, రెండవది ప్రమాదానికి గురైన వ్యక్తి స్పందన ఎలా ఉంది?, మూడవది సహాయం కోసం ఎలా అర్థించాలి?, నాల్గవది శ్వాస ఏ స్థితిలో ఉంది? అనేవి ప్రధానమన్నారు. వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకొని నిమిషానికి 30 సార్లు చెస్ట్ ప్రెస్, 2 సార్లు మౌత్ బ్రీత్ చేయాలన్నారు. కుడి చేతితో ఎడవ చేతిని మెలివేసి చెస్ట్ పై ప్రస్ చేయాలన్నారు. ఒకవేళ మౌత్ బ్రీత్ ఇవ్వని సందర్భంలో నిమిషానికి 120 సార్లు చెట్స్ ప్రెస్ చేయాలన్నారు.
చిన్న పిల్లలకైతే నిమిషానికి 15 సార్లు చెట్ ప్రెస్, 2 సార్లు మౌత్ బ్రీత్ చేయాలన్నారు. చిన్నపిల్లలకు రెండువేళ్లతో మాత్రమే చెస్ట్ ప్రెస్ చేయాలన్నారు. నాణెం మింగిన వారిని వెనుక వీపుపై పైకి నిమిరాలని సూచించారు. ఫిట్స్ వచ్చినవారిని పక్కకు పడుకోబెట్టి నురుగునంతా తీసివేస్తూ సిపిఆర్ చేయాలన్నారు. ఈ విధానమంతా విద్యార్థుల చేత ప్రయోగ పూర్వకంగా చేయించారు. ఈ విధానం ద్వారా 95 శాతం మనుషుల ప్రాణాలను రక్షింపడుతాయన్నారు.
ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి మాట్లాడుతూ… ఈ కార్యక్రమం విద్యార్థిలకు ఎంతో ఉపయుక్తమైందని అన్నారు. కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… ఒక రైలు ప్రయాణంలో జరిగిన ప్రత్యక్ష అనుభవాన్ని వివరిస్తూ, అక్కడ సిపిఆర్ ప్రయోగం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని ఎలా రక్షించారో తెలిపారు. కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు డా. అజ్జ శ్రీనివాస్, ఐఎపి కోశాధికారి డా. బాలేష్ నేతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్స్ డా. ఎన్. స్వప్న, డా. ఎ. మహేందర్ రెడ్డి, డిపిఆర్ డా. వి. త్రివేణి, అధితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.