నిజామాబాద్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జనరల్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి హాల్ టికెట్లను పొందవచ్చని లేదా నేరుగా ఇంటర్నెట్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు.
అయితే జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షలు కేవలం నిజామాబాద్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఖిలా) అలాగే నిజామాబాద్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలను కేవలం బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఖిల్లా) లో మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు ఈ విషయాన్ని గమనించాలని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులకు పరీక్షల టైమ్ టేబుల్ వారి హాల్ టికెట్‌లో ఇస్తారని గత వార్షిక పరీక్షల్లో గైరహాజరైన మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. ఒకేషనల్ అన్ని గ్రూపులకు ప్రాక్టికల్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం నిజామాబాద్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఖిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి పేర్కొన్నారు. అలాగే జనరల్ సబ్జెక్టులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలను నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, నిజామాబాద్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి వివరించారు.