కామారెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ అంగన్వాడి కేంద్రంలో సోమవారం అతి తక్కువ బరువున్న పిల్లలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలకు కొత్తగా వచ్చిన బాలామృతం ప్లస్ గురించి తెలిపారు.
పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి కార్యకర్తలు తమ చిన్నారులకు పౌష్టికారం అందించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డిడబ్ల్యువో రమ్య, సిడిపిఓ శ్రీలత, పర్యవేక్షకురాలు పద్మ, అంగన్వాడి టీచర్లు రాజేశ్వరి, స్వరూప, కవిత, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.