కామారెడ్డి, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛందంగా యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో మాట్లాడారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
ఫారం నెంబర్ 8 లో కొన్ని మార్పులు జరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా అవసరమైన కొత్త ఫారాలను జిల్లా ఎన్నికల అధికారులు తయారు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఎన్నికల విభాగం అధికారి సాయి భుజంగరావు, అధికారులు నరేందర్, ప్రశాంత్ పాల్గొన్నారు.