కామారెడ్డి, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజు రైస్ మిల్లర్లు జిల్లాలో 8 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్లుతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
రైస్ మిల్ యజమానులు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని సూచించారు. మిల్లుల వారీగా తడిచిపోయిన వరి ధాన్యం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఇంచార్జ్ డిఎస్‌ఓ రాజశేఖర్, జిఎం జితేంద్రప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.