మోర్తాడ్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం అదికారులు, నాయకులు కలిసి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని ధర్మోరా, డొన్కల్, దోన్పాల్, మోర్తాడ్, పాలెం, షెట్పల్లి, సుంకెట్ తిమ్మాపూర్, వడ్యాట్ గ్రామాలలోని మొత్తం 25 మంది లబ్టిదారులకు గాను 25 లక్షల 2 వేల 9 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ బావయ్య, డిప్యూటి తహసీల్దార్ సుజాత, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొగటి శ్రీనివాస్, మోర్తాద్ జద్పిటిసి బద్దం రవి, మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా, స్టానిక సర్పంచ్ బోగ ధరణి, ఆనంద్, కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, లబ్టిదారులు, తదితరులు పాల్గొన్నారు.