డిచ్‌పల్లి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించామని చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి తెలిపారు. 65 మంది విద్యార్థులకు టెస్ట్ చేయగా ముగ్గురు విద్యార్థులకు పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇది వరకే 17 మందికి పాజిటీవ్ రాగా అందులో ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఏడుగురు విద్యార్థులు ప్రత్యేకంగా హాస్టల్ గదుల్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు.
ఇంకా ఏడుగురు విద్యార్థులు వారి స్వంత ఇంటికి వెళ్లినట్లుగా చెప్పారు. గురువారం నిర్ధారణ అయిన ముగ్గురు విద్యార్థులను కూడా క్వారంటైన్‌లోకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంప్‌లో చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవితో పాటుగా డిప్యూటి డిఎం హెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్, ఇందాల్వాయి పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ డా. అరవింద్, హెల్త్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ డా. వెంకట్, సుకాత, శివరాణి, ఉదయ, పోసాని ఎఎన్‌ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు బూస్టర్ డోస్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కావున అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందరు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు.