ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కామారెడ్డి, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన కామారెడ్డి జోన్‌ సమావేశంలో టిపిటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ డాక్టర్‌ నాగభూషణం మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసము ఉపాధ్యాయులు కదిలి రావాలని, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపు నిచ్చారు.

వారు మాట్లాడుతూ పాఠశాలల్లో 19 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయడం కోసం వెంటనే స్కావెంజర్లను నియమించాలని, ప్రభుత్వము విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

టిపిటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు నళినీ దేవి మాట్లాడుతూ నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం విజయవంతమై విద్యార్థులకు భాషలో, సంఖ్యాభావన అవగాహన పెంపొందాలంటే ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ప్రభుత్వం నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వము ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.

టిపిటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి తృప్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ 317 జీవోలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తూ, మిగిలిపోయిన 13 జిల్లాల స్పోజ్‌ కేటగిరి టీచర్లను వెంటనే ఒకే దగ్గరికి తీసుకురావాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్‌ చక్రపాణి మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలు పరిష్కారానికి టిపిటిఎఫ్‌ నిబద్దతతో నిజాయితీగా కొట్లాడుతున్న సంస్థ అని, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో టిపిటిఎఫ్‌లో సభ్యులుగా చేరాలని, విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసము పోరాటాలే మార్గాలని రాబోయే కాలంలో టిపిటిఎఫ్‌ నిర్వహించే ఉద్యమాలలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్‌ వివిధ మండలాల బాధ్యులు గోపు శ్రీనివాస్‌, కేఎన్‌ భగత్‌, రాజేశం, లింగం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »