డిచ్పల్లి, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం కూడా బూస్టర్ డోస్ టీకా క్యాంప్ ఏర్పాటు చేశామని చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి తెలిపారు. శుక్రవారం 210 మందికి బూస్టర్ డోస్ టీకాలు వేయగా, శనివారం 89 మందికి వేశారని తెలిపారు.
అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు బూస్టర్ డోస్ టీకాలు వేయించుకున్నారని అన్నారు. అదే విధంగా వీసీ, రిజిస్ట్రార్ల ప్రత్యేక శ్రద్ధతో విదార్థులను క్వారంటైన్లో ఉంచి పౌష్టికాహారం, మందులను అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్వారంటైన్ లో ఉన్న విద్యార్థుల్లో ఏడుగురు బాలురకు, ఇద్దరు బాలికలకు పరీక్షల్లో నెగిటీవ్ రిపోర్ట్స్ వచ్చాయని ఆయన తెలిపారు.