మోర్తాడ్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో ప్రతిరోజు ఇంటింటా యజ్ఞం నిర్వహిస్తున్నట్టు జక్కం రాజు ఆర్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజ్ఞ కార్యక్రమం మోర్తాడ్లోని మహర్షి దయానంద ఆశ్రమం ఆర్యసమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా గ్రామంలో ఇంటింటా ప్రతిరోజు యజ్ఞం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్యసమాజం కోశాధికారి జక్కం పృథ్వీరాజ్, అంబల్ల సేనాపతి, టి.బి. దయానంద్, శ్రావణి, నవ్యశ్రీ, రమాదేవి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.