కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు బయోమెట్రిక్ యంత్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ, స్వయం సాయిక సంఘాల అనుసంధానంలో డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలను అందిస్తారని చెప్పారు. గ్రామాల్లో ఉండి సులభంగా బ్యాంకు సేవలను పొందడం ద్వారా సమయం అదా అవుతుందని, డబ్బులు పొందే వెసులుబాటు కలుగుతుందన్నారు. డిఆర్‌డిఏ సెర్ప్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి బ్యాంకు కరెస్పాండెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ, రాష్ట్ర డిజిపే మేనేజర్ సునీల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.