కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతివేగమే ప్రమాదాలకు కారణం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అతివేగంగా వెళ్లే వాహనాలకు స్పీడ్ గన్‌లు జరిమానాలు విధిస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సిఐ నరేష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.