ఎమ్మెల్యేను పరామర్శించిన నందిపేట నాయకులు

నందిపేట్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్‌, నిజామాబాద్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డిని నందిపేట టిఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌లో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిత్యం శ్రమిస్తూ, ఆర్మూర్‌ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎవరికి అనారోగ్యం జరిగినా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసానిస్తూ, 24 గంటలు పేద ప్రజల సంక్షేమ కోసం శ్రమించే జీవన్‌ రెడ్డిపై హత్యయత్నానికి పాల్పడిన నిందితుడిని ఆయన వెనుక ఉన్న కుట్ర దారులను, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన అధికారులకు కోరినట్టు మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్‌ పేర్కొన్నారు.

రాజకీయాలలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంది ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జీవన్‌ రెడ్డి లాంటి ప్రజాభిమానం గల నేతను చూసి ఓర్వలేక కొంతమంది కుట్ర దారులు ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజా క్షేమం కోరాలి కానీ, ప్రజల మనిషిని మట్టి పెడితే వారికి ఒరిగేది ఏముండదన్నారు. హత్యాయత్నంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి, వెనుకున్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »