ఎల్లుండి కేబినెట్ సమావేశం

హైద‌రాబాద్‌, జూన్ 6

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది.

రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాల మీద కేబినెట్ చర్చించనుంది.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలను సమీక్షిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించనున్నారు.

థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించనుంది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైందనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకోబోతున్నది.

19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

కార్యక్రమంలో అందరు మంత్రులు ఏకకాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »