కామారెడ్డిలో ఆచార్య జయశంకర్‌ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ రగిలించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శనివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.

స్వయం పాలనలోని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలు, కష్టాలను ఆయన వివరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »