నిజామాబాద్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్‌కు చెందిన మరో బిడ్డ సుబేదార్ హుస్సాముద్దీన్ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లా, తెలంగాణ కీర్తిని విశ్వ వ్యాప్తం చేసి కామన్ వెల్త్ క్రీడలో రెండో సారి పథకం సాధించిన హుస్సాముద్దీన్‌కు మంత్రి వేముల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్‌ల గెలుపు యావత్ నిజామాబాద్ ప్రజలకు గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
నిఖత్ జరీన్ మొదటి కోచ్ శంషాముద్దీన్ కుమారుడే హుస్సాముద్దీన్ అని మంత్రి తెలిపారు. నిజామాబాద్ బిడ్డలను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దినందుకు కోచ్ శంషాముద్దీన్‌కు మంత్రి ప్రత్యేక అభినందలు తెలిపారు.