నిజామాబాద్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ‘‘సహస్రాబ్ది మహా మనిషి మహాత్మా గాంధీ’’ అనే అంశంపై కవితా సంకలనం రూపొందిస్తుందని తెలంగాణ రచయితల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సంచిక కోసం జిల్లాలోని కవులు, కవయిత్రులు 15 పంక్తులకు మించని కవితను మహాత్ముని జీవితం, మహాత్ముని ఆదర్శాలు ఇతివృత్తాలుగా ఆగస్టు 12వ తేదీలోగా సంఘం కార్యదర్శి గుత్ప ప్రసాద్ 99636 98855 నెంబర్‌కు వాట్సప్ ద్వారా పంపాలని కోరారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం ఉంటుందని ఆయన తెలిపారు.