కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి సూచన మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు.
అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ 1960లో యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందని, 1970వ దశకంలో సంజయ్ గాంధీ నాయకత్వంలో, యువజన కాంగ్రెస్ చెట్ల పెంపకం, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలను చేపట్టిందని, గృహ హింస, వరకట్న మరణాలకు వ్యతిరేకంగా పోరాడిరదన్నారు.
సంజయ్‌గాంధీ మరణానంతరం రాజీవ్‌గాంధీ యువజన కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారని, 1984లో ప్రధానమంత్రి అయిన తర్వాత రాజీవ్ గాంధీ ఓటు వేసే వయస్సును 18కి తగ్గించారని, రాహుల్ గాంధీ దేశంలో ఏ పార్టీలో లేనట్లుగా కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ విభాగాలకు అంతర్గత ఎన్నికలు పెట్టి విద్యార్థి యువజన సంఘాల్లో కొత్త రక్తాన్ని స్వాగతించడం కోసం పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజ్మత్ అలీ, మేత్రి శంకర్, రాహుల్, సాగర్, డానియల్, అజీజ్, ఆమెర్, రవి తదితరులు పాల్గొన్నారు.