డిచ్‌పల్లి, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో శ్రీపతి కృష్ణవేణి రూపొందించిన సిద్ధాంత గ్రంథంపైన జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఆచార్య ఎమ్. మమత పర్యవేక్షణలో కృష్ణవేణి ‘‘యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఆఫ్ కాటిల్ యూరిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్ర విభాగంలో సమర్పించారు.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన విశ్రాంత సహాయ ఆచార్యులు డా. కృష్ణారెడ్డి ఎక్స్టెర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. కృష్ణవేణిని తెయు వీసీ ఆచార్య రవిందర్ గుప్తా మరియు రిజిస్ట్రార్ ఆచార్య శివశంకర్ అభినందించారు.
కార్యక్రమంలో తెయు సైన్స్ డీన్ ఆచార్య ఎమ్. అరుణ, వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య బి. విద్యావర్ధిని, చైర్పర్సన్, బివోఎస్ డా.ఎ.ఎ. హలీమ్ ఖాన్, డా. వి. జలంధర్, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.