కామారెడ్డి, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివంగత నేత, మాజీ ప్రధాని భారతరత్న వాజ్ పేయి వర్థంతి సందర్భంగా బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ స్థానాలు నుండి దేశ ప్రధాని పీఠం అధిరోహించింది అంటే వాజ్పాయ్ మహానుభావుని ఫలితమే అని, దేశం కోసం జీవితం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అటల్జి అని అన్నారు.
జాతీయ వాదమే ఊపిరిగా ఉంటు ప్రధానిగా సుస్థిర పాలన అందించిన ఆయన నేటి కార్యకర్తలకు ఆదర్శం అన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.