డిచ్‌పల్లి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ పంజాబ్ లోని అమృత్ సర్ లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గల పరిశోధక విద్యార్థి కునాల్ పబీబ్ సిద్ధాంత గ్రంథంపై సోమవారం ఉదయం నిర్వహించిన పిహెచ్. డి. ఆన్ లైన్ (వర్చువల్) వైవా వోస్ ( మౌఖిక పరీక్ష ) కు ఎక్స్ ట్రనల్ ఎగ్జామినర్ గా హాజరైనారు.
పరిశోధకుడిని తన పరిశోధానాంశంపై వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం వీసీ పిహెచ్. డి. డాక్టరేట్ ను కునాల్ పబీబ్ కు ఇవ్వవలసిందిగా గురునానక్ దేవ్ యూనివర్సిటీకి సిఫారస్ చేశారు.