కామారెడ్డి, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జన్మ దినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ అని, ఆయన యువతను చేరదీయాలని ఉద్దేశంతోనే 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన మహా నేత అన్నారు.
అలాగే యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని ఉద్దేశంతోనే టెక్నాలజీ రంగంలో గానీ, ఐటీ రంగంలో గానీ ఎన్నో కొత్త కొత్త సంస్కరణలను తీసుకొచ్చిన మహా మేధావి అని, అలాగే పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఉద్దేశంతోనే ఉచిత విద్యా పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలు సాధించే దిశగా కార్యకర్తలు పని చేయాలని శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేణి సందీప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారంగుల అశోక్ రెడ్డి, పాక రవి ప్రసాద్, కౌన్సిలర్లు అన్వర్ హైమద్, మాజీ కౌన్సిలర్ గోనె శ్రీనివాస్, రవీందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాత్రిక సత్యం, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్, సర్వర్, ఖదీర్, అతిక్, వైద్య కిషన్ రావు, జమీల్, శంకర్, రవి, నజీర్, సాజిద్, లక్క పత్తిని గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.