ప్రణాళికా బద్దంగా చదవాలి

కామారెడ్డి, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక బద్ధంగా చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశినగర్‌ మండలం మర్కల్‌ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో ఎలా విజయం సాధించాలి అనే అంశంపై ప్రేరణ కల్పించారు.

పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందజేస్తానని పేర్కొన్నారు. డిగ్రీ కళాశాలకు సీసీ కెమెరాలు, కంప్యూటర్స్‌ ను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మార్చ్‌ఫాస్ట్‌తో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాధిక, వైస్‌ ప్రిన్సిపల్‌ వనజ, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ ప్రతిభ, అనిత , విద్యార్థినిలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »