డిచ్‌పల్లి, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా నుంచి 25 కోట్ల నిధులకు సానుకూల స్పందన వచ్చిందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢల్లీి పర్యటనలో ఉన్న వీసీ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డా. చంద్రశేఖర్ శ్రీవారిని కలిసి శాలువాతో సత్కరించారు.
అదే విధంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అధికారులు ఎస్సీ, ఎస్టీ హబ్ ఇంచార్జి డా. గోపి కృష్ణ, ఫిస్ట్ అండ్ పర్స్ ప్రోగ్రాం ఇంచార్జి డా. అరిందం భట్టాచార్య, డా. శివకుమార్, సెర్బ్ గ్రాంట్ ఇంచార్జి డా. సుకుమార్ డే తదితరులను కలిసి శాలువాతో సత్కరించారు.
టీయూకు ఎస్సీ, ఎస్టీ హబ్, ఫిస్ట్ అండ్ పర్స్, సెర్బ్‌ల నుంచి ప్రాజెక్ట్‌ల అంగీకారం కోసం అభ్యర్థించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వివిధ ప్రతిపాదనల ప్రణాళికల కోసం ప్రాథమిక వేరిఫికేషన్ జరిగింది. ఇంటర్వ్యూ కోసం మరో సారి వీసీ, బృందం న్యూఢల్లీికి వెళ్లవలసి ఉంది. న్యూఢల్లీి పర్యటనలో వీసీతో పాటు యూజీసీ డైరెక్టర్ డా. సిహెచ్. ఆంజనేయులు, ఐక్యూఎసీ డైరెక్టర్ డా. చంద్రశేఖర్ ఉన్నారు.