కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా ఆధ్వర్యంలో వెయ్యి ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు వాడవద్దని జల కాలుష్యం చేయవద్దని మట్టి గణపతి వాడాలని వివరించారు.
ఆదివారము విశ్వనాధుల మహేష్ గుప్తా నివాసం అశోక్ నగర్ కాలనీలో మట్టి వినాయకులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐవిఎఫ్ ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్ గుప్తా, కోశాధికారి వలిపిశెట్టి లక్ష్మిరాజం, కామారెడ్డి పట్టణ ఎన్జీవోస్ కాలనీ ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు అతిమాముల రమేష్ గుప్తా, అశోక్ నగర్ కాలనీవాసులు, అశోక్ నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.