ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం

నిజామాబాద్‌, ఆగష్టు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం పోరాటం చేయాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ కోరారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్‌ను ఏఐటీయూసీ నాయకులు శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం సంఘటితంగా పోరాడి సాదించుకోవడమే ఏకైక మార్గమన్నారు. మనం నివసించే ప్రాంతాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం సిపిఐ పోరాటం నిర్వహిస్తుందని, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని చైతన్యం చేసి పోరాటాల వైపు నడపాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, జిల్లా నాయకులు హనుమాన్లు, సాయన్న, బాల్‌ లింగం తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »