కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ పాత నాగరాజు పర్యవేక్షణలో అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించిన టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలును సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి, మంజీరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ ఒకవైపు విద్యార్థి ఉద్యమ నేతగా, మరొకవైపు సామాజిక సేవకుడిగా రక్తదానం చేయడమే కాకుండా వేలాదిమంది ప్రాణాలను కాపాడి, విద్య రంగంలో అత్యున్నతమైన డాక్టరేటును సాధించడం అభినందనీయమని, మంజీరా డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థిగా డిగ్రీలో యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకాన్ని కూడా బాలు సాధించడం జరిగిందని గుర్తు చేశారు.
కష్టపడితే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చునని నేటి యువతకు డాక్టర్ బాలు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో స్ఫూర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గౌడ్, ఆర్యభట్ట కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, బాన్సువాడ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు విఠల్, డాక్టర్ సురేష్ గౌడ్, శర్మ, స్వామి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.