నిజామాబాద్, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు జెడ్పి సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధ, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, ప్రజావాణి సైట్లో వివరాలను అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా హఠాన్మరణం చెందిన జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.