మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌లో మంగళవారం కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్‌ వేద ప్రకాష్‌ మాట్లాడుతూ హిందూ పండుగలు పర్యావరణానికి హాని కలిగించని విధంగా జరుపుకోవాలని, ప్లాస్టరాఫ్‌ పారీస్‌ వాడడం వల్ల వాటిని నీళ్లలో వేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఆ నీటి ద్వారా రావడం జరుగుతుందని వివరించారు.

హిందువులందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని, పర్యావరణాన్ని కాపాడినట్టయితే మనను ఆ పర్యావరణమే తిరిగి కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో లింగాపూర్‌ వార్డు సభ్యులు శ్రీనివాస్‌, ప్రవీణ్‌, నరేందర్‌ రెడ్డి, నర్సింలు, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »