సెప్టెంబర్‌ 8 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ, నాలుగవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు సెప్టెంబర్‌ 8 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు.

పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 10 వ తేదీ వరకు, 200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 12 వ తేదీ వరకు, 500 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 13 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని బి.ఎడ్‌. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »