ఐవిఎఫ్‌ సేవలు అభినందనీయం


కామరెడ్డి, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా జడ్జ్‌ శ్రీదేవి, సబ్‌ కోర్టు జడ్జి కిరణ్‌ కుమార్‌లకు ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు విశ్వనాధుల మహేష్‌ గుప్తా మట్టి గణపతుల ప్రతిమలను అందజేశారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జడ్జ్‌ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకూడదని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాల వలన నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుందని ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలని పూజించాలని అన్నారు. ఐవిఎఫ్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినందనీయమని స్వచ్ఛంద సంస్థలు, సమాజసేవకులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »