నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్‌ఎస్‌ఎఫ్ రక్షణ కమిటీ నాయకులు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందర సమావేశమై డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో బోధన్ కు వచ్చిన సందర్భంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటు అయినా 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వము స్వాధీనం చేసుకుని, ఫ్యాక్టరీ కి పూర్వ వైభవాన్ని కల్పిస్తామని మాట తప్పను మడమే తిప్పను అని మాట తప్పి మడమే తిప్పితే మెడమీదికెళ్ళి తలకాయ తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ మరి ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఫ్యాక్టరీని ఎందుకు చాలు చేయలేదని ప్రశ్నించారు.
నడిచే ఫ్యాక్టరీని మూసివేసిన ఘనత మీకే దక్కుతుందని అన్నారు. ఫ్యాక్టరీని నడిపినట్లయితే ఈ ప్రాంత రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయ పంటగా చెరుకును సాగు చేస్తారని, ఫ్యాక్టరీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, ఈ ప్రాంతంలో వ్యాపారము మెరుగవుతుందని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ మూతపడడం మూలంగా ఫ్యాక్టరీలో పని చేసిన కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని, మరికొందరు ఆకలి చావులకు గురయ్యారని తెలిపారు.
ఫ్యాక్టరీ మూతపడడం మూలంగా మంజీరా నది పరివాహక ప్రాంత రైతాంగాం వరి, సోయా పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్నారని ఈ విషయము ఈ ప్రాంత పాలక పార్టీ నాయకులకు తెలిసిన విషయమేనని ఈ విషయాలను 5న, నిజామాబాద్‌లో జరిగే సభలో సీఎం దృష్టికి టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలే అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎఫ్ రక్షణ కమిటీ నాయకులు బి. మల్లేష్,షేక్ బాబు,జే.శంకర్ గౌడ్, పి.వరదయ్య, పడాల శంకర్, సిహెచ్ యాదగిరి గౌడ్, బి. గంగాధర్ , కుమారస్వామి, ఫయాజ్, రాజ్ కుమార్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.