కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ చెందిన పార్షి శివసాయి (18) హైదరాబాదులోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలుడికి నరాల సమస్యతో సికింద్రాబాద్ యశోద వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ రక్తదాతల సమన్వయకర్త అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లక్ష్మీ దేవనపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇశాంత్ రెడ్డికి తెలియజేయగానే శుకవ్రారం హైదరాబాద్ వెళ్లి సకాలంలో ఓ నెగటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సూచనల మేరకు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఎల్లవేళల రక్తాన్ని అందించడానికి ఐవిఎఫ్ రక్తదాతల సమూహం సిద్ధంగా ఉందని, రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత నిశాంత్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.