ఆచార్య కె. శివ శంకర్‌కు ఉత్తమ అధ్యాపక పురస్కారం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ కె. శివశంకర్‌ సెప్టెంబర్‌ 5 వ తేదీన గురుపూజోత్సవం రోజు ఉత్తమ అధ్యాపక పురస్కారం – 2022 అందుకోనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2006 సంవత్సరం ఏర్పడినప్పటి నుండి వివిధ హోదాలలో యూనివర్సిటీ అకాడమిక్‌, పరిపాలన రంగాలలో మమేకమైన మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ఆచార్య కే శివ శంకర్‌కి యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్‌ టీచర్‌ అవార్డు ప్రకటించింది.

వచ్చే ఏడాది జనవరిలో రిటైర్మెంట్‌ కానున్న సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ శివ శంకర్‌కు కెరియర్‌ చివరి దశలోనైనా సరైన గుర్తింపు లభించినట్లయింది. మొత్తం మూడు సార్లు రిజిస్ట్రార్‌గా, డిచ్పల్లిలో క్యాంపస్‌ ఆరు వందల ఎకరాలలో ఏర్పాటు చేయాలన్న అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని, జిల్లా అధికారుల సమన్వయంతో భూసేకరణ, కొత్త క్యాంపస్‌ భవన నిర్మాణాలు, గిరిరాజ్‌ కాలేజ్‌ నుండి కొత్త క్యాంపస్‌కు యూనివర్సిటీ తరలింపు ఇలాంటి అనేక చారిత్రాత్మక కార్యక్రమాలలో యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రొఫెసర్‌ శివ శంకర్‌ ప్రధాన భూమిక పోషించారు.

యూనివర్సిటికీ 2 ఎఫ్‌, 12 బి సాధించడంలో, జిల్లా అనుబంధ కళాశాలలను పొందడంలో కృషి చేశారు. గత ఒకటిన్నర దశాబ్దం పైగా ఆచార్యునిగా సేవలందిస్తూ, వివిధ హోదాలలో విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆచార్య శివ శంకర్‌కు పదవీ విరమణ సమయంలోనైనా సరైన గుర్తింపు లభించినదుకు సీనియర్‌ టీచర్లు, ఫ్యాకల్టీ, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిక్నూర్‌ క్యాంపస్‌ టేకోవర్‌ చేసి దానిని మినీ క్యాంపస్‌గా, సౌత్‌ క్యాంపస్‌గా అభివృద్ధి చేయడంలోనూ ఆచార్య శివ శంకర్‌ కీలక పాత్ర పోషించారు. ఆరు కోర్సులతో ప్రారంభించిన యూనివర్సిటీ ఇప్పుడు దాదాపు 30 కోర్సులకు చేరడంలో ఆచార్య శివశంకర్‌ తన వంతు కృషి చేశారు. యూనివర్సిటీలో రిక్రూట్‌ అయిన తొలి బ్యాచ్‌ అధ్యాపకులలో ఆచార్య శివ శంకర్‌ ఒకరు.

ఆయన రిజిస్ట్రార్‌గా, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌గా, యుజిసి సెల్‌ డీన్‌గా, వివిధ ఫ్యాకల్టీల డీన్‌గా, విభాగ అధిపతిగా, బిఓఎస్‌ చైర్‌ పర్సన్‌గా వివిధ హోదాలలో యూనివర్సిటీకి అనేక రకాలైన సేవలు అందించారు. ఒక సీనియర్‌ టీచర్‌కి, అపార అనుభవం గల పరిపాలన దక్షునికి ఈ రాష్ట్రస్థాయి బెస్ట్‌ టీచర్‌ అవార్డు రావడం పట్ల తెలంగాణ యూనివర్సిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన పర్యవేక్షణలో ఇప్పటివరకు ఐదుగురు రీసెర్చ్‌ స్కాలర్లు డాక్టరేట్‌ పట్టా పొందారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పాలకవర్గంలో ఈసీ మెంబర్‌గా కూడా ప్రొఫెసర్‌ శివ శంకర్‌ ఉన్నారు. గతంలో యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా కూడా పని చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »