కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక పద్ధతులు ఉపయోగించి పాల దిగుబడిలను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. హైబ్రిడ్ పశుగ్రాసాలను సాగుచేసి పశువులకు పచ్చిమేతను అందించాలని కోరారు. స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలకు మేలు జాతి పశువులను పెంచే విధంగా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడిఎ జగన్నాథచారి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్, వైద్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.