కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నవీన్ కుమార్ (29) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్ రాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ (ఆర్డీపీలు) అవసరం కావడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్ కుమార్‌ను సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి చెందిన రాజు, కాచాపూర్ గ్రామానికి చెందిన హుస్సేన్ సహకారంతో 2 యూనిట్ల ఆర్డిపీలను సకాలంలో అందజేసి ప్రాణాలను కాపాడారు.
ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్ మాట్లాడుతూ రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున, కామారెడ్డి రక్తదాతల సమూహం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని రక్తదానానికి యువత ముందుకు రావాలని, ప్రపంచంలో డబ్బు లేకుండా చేయగలిగే సహాయం కేవలం రక్తదానమేనని, కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లప్పుడూ సకాలంలో రక్తాన్ని అందించడానికి సిద్ధమేనని ఐవిఎఫ్ తెలంగాణ రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినందుకు కిరణ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కెబిఎస్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ జీవన్ పాల్గొన్నారు.