కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంఘం గ్రామానికి చెందిన రాజమణి (35) మహిళలకు ఆపరేషన్ నిమిత్తమై గాంధారిలోని వెంకటేశ్వర వైద్యశాలలో బీ పాజిటివ్ రక్తము అత్యవసరంగా కావలసి ఉండడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్ కు తెలియజేయగానే సకాలంలో స్పందించి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలపారు. రక్తదానానికి ముందుకు వచ్చిన సంతోష్‌కి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టీ.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చందన్, మహేష్, రాజేందర్, నవీన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.