కామారెడ్డి, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్ అన్నారు. జుక్కల్ ఆడిటోరియంలో బుధవారం మహిళా సంఘాల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు.
రూర్బన్ పథకం ద్వారా కుట్టు శిక్షణ నేర్చుకున్నామని మహిళలు తెలిపారు. బ్యూటిషన్, మగ్గం వర్క్ నేర్పించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ నివేదిత, కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డిఓ సాయన్న, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం ప్రతినిధులకు ఐకెపి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.