ఆర్మూర్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి రంగన్న, పెర్కిట్ పూసల సంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ , ఉపాధ్యక్షులు పొదిల కిషన్, ప్రధాన కార్యదర్శి సుంకరి గంగా మోహన్, క్యాషియర్ పొదిల గంగాధర్, పొదిల మైసయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు.