కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ లిస్టు గ్రామపంచాయతీలో పెట్టాలని జిల్లా గ్రామ అభివృద్ధి అధికారి బి .సాయన్నకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నా రెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట్ గ్రామసర్పంచ్ గీ రెడ్డి, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సంవత్సరాల తర్వాత నూతన పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, నూతనంగా వచ్చిన లబ్దిదారుల జాబితా గ్రామపంచాయతీలో పెట్టాలని కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా గ్రామ అభివృద్ధి అధికారి సాయన్నకు వినతిపత్రం ఇచ్చారు.
లబ్దిదారుల జాబితా గ్రామపంచాయతీలో పెట్టకపోవడంతో అర్హత కలిగిన వారికి వచ్చాయా, లేకపోతే తెరాస పార్టీ రాజకీయ నాయకులకు సంబంధించిన వారికే వచ్చాయా అనే అనుమానం వ్యక్తవుతుందని అన్నారు. ఇప్పటికైనా కొత్తగా వచ్చిన నూతన లబ్దిదారుల జాబితా గ్రామపంచాయతీలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ కచ్చితంగా పింఛన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏన్నం రాంరెడ్డి, మల్లేష్ రెడ్డి పాల్గొన్నారు.