కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో అత్యధిక పంచాయతీ అవార్డులను కామారెడ్డి జిల్లా సాధించే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఆన్లైన్ పోర్టల్‌లో ఈనెల 10వ తేదీ నుంచి గ్రామపంచాయతీలు అవార్డుల కోసం తప్పులు లేకుండా డాటా నమోదు చేయాలని సూచించారు. మండల స్థాయిలో గ్రామస్థాయి అధికారులతో అవార్డులు పోర్టల్‌లో నమోదు చేసే అంశంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈనెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు హాజరయ్యే విధంగా అధికారులు చూడాలని కోరారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్‌డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.